‘కొన్ని గంటల తరువాత ప్రార్థిస్తున్నాను’ అంటూ తన సానుభూతిని తెలిపింది ఊర్వశి రౌతేలా. స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురైనందుకు ఇనిస్టాలో ఈ సందేశాన్ని పోస్టు చేసింది ఊర్వశి.
తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ముంబై కోకిలాబెనన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రి ఫోటోను షేర్ చేసింది. కారు ప్రమాదంలో కారుప్రమాదంలో మోకాలు, చీలమండలో(ankel) స్నాయువు(tendon)గాయాలు చికిత్స కోసం డెహ్రూడూన్ నుంచి ముంబైలోని అంధేరీలో గల ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికి ఈ పోస్ట్ చేయడం గమనార్హం.
ఊర్వశి తన ఇనిస్టా పోస్ట్ లో ఏమీ రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పింది. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి స్వస్థలం రూర్కీకి వెళ్తున్న రిషబ్ పంత్ ఎన్ హెచ్ -58 హైవేపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో రిషబ్ ఒక్కడే కారులో ఉన్నాడు.
రిషబ్, ఊర్వశిల మధ్య రిలేషన్ గురించి చాలా పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ గంటల తరబడి వెయిట్ చేసాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్,ఊర్వశిలు డేటింగ్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.
కొంతకాలం తర్వాత వాట్సాప్ లో ఒకర్నొకరు బ్లాక్ చేసుకున్నారని వార్తలూ ఊపందుకున్నాయి.ఆమెను కాదని 2019 లో తన స్నేహితురాలు ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు.
అతను ఇన్ స్టాగ్రామ్ లో ఇషాతో ఉన్న చిత్రాన్ని కూడా ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. ఆమె కోసం రాసిన సందేశంలో “నేను చాలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను.”
అంటూ ఇషాను ఉద్దేశించి రాయడంతో అవన్నీ పుకార్లని తేలిపోయింది.వాళ్ళ మధ్య ఎలాంటి పొరపొచ్చాలున్నా మర్చిపోయి రిషబ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఊర్వశి కనీస మర్యాదను పాటించడం మంచివిషయం.