కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త సినిమాలను ఇక్కడ ప్రీవ్యూ చేస్తారు.
ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్ఫిట్లతో రెడ్ కార్పెట్ పై తమ అందాలు ఆరబోస్తారు.అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా వేసుకున్న డ్రెస్సు వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఇప్పటి వరకు నాలుగు సార్లు హొయలొలికించింది. మొదటి నుంచి అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌తో ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
మొదటి రోజు పింక్ కలర్ గౌను ధరించి మెడలో బంగారు మొసళ్ల నెక్లెస్ తో అదరగొట్టింది. ఆ తర్వాత వైట్ అండ్ బ్లూ కలర్ గౌను వేసుకుని బ్లూ కలర్ లిప్షేడ్తో దిమ్మతిరిగే లుక్స్ తో ఆకట్టుకుంది.
తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో వెరైటీ లుక్‌లో కనిపించింది. క్లబ్ జీరో మూవీ ప్రీమియర్ కోసం కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించిన ఊర్వశి రౌటేలా.. గ్రీన్ కలర్ ఫీదర్ డ్రెస్సులో కనిపించి అందరిని ఆకట్టుకుంది.
ఈకలతో తయారు చేసిన ఈ డ్రెస్సులో ఊర్వశి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. పూర్తిగా రెక్కలతో ఈ ఔట్ ఫిట్ ను డిజైన్ చేశారు. రెండు రెక్కలుగా కనిపించేలా ఈ డ్రెస్ ఉంది.ఇంకా చెప్పాలంటే రామచిలుక రెక్కలు తొడిగిన ఫీనిక్స్ పక్షిలా ఊర్వశి రౌటేలా కనిపించింది.
తలపై కూడా రెక్కల ఈకలతో తయారు చేసిన ఓ టోపీని కూడా పెట్టుకుంది. వెయిర్డ్ లుక్ లో వెరైటీగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. నెక్ ను న్యూడ్‌గా వదిలేసి.. చెవులకు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.
బోల్డ్ ఐ మేకప్ ప్లం లిప్ షేడ్, బ్లష్డ్ చీక్స్ తో మినిమల్ మేకప్ తో హైఓల్టేజ్ స్టైల్‌ను క్యారీ చేసిందీ ముద్దుగుమ్మ.అయితే తన రెండు చేతులకు రింగ్స్ పెట్టుకుంది. మొత్తానికి ఊర్వసి దేవలోకంలోంచి విచ్చేసిన ఊర్వశిలాగే ఉంది.