చిన్న దేశం అయిన ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూనే ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ గర్ల్ ఫ్రెండ్ అలీనా కబేవా పై కూడా ఆంక్షలు విధించారు.
మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అయిన కబేవా .. పుతిన్ గర్ల్‌ఫ్రెండ్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ శాఖ ఇంకా అనేక మంది రష్యా సంపన్నులపై ఆంక్షలు ప్రకటించింది. పుతిన్ స్నేహితుడు, బిలియనరీ ఆండ్రే గ్రిగోరవిచ్ గురేవ్‌పై కూడా ఆంక్షలు అమలుచేశారు.
లండన్‌లో రెండవ అతిపెద్ద ఎస్టేట్ విటాన్‌హాస్ట్ ఎస్టేట్ అతని పేరుమీద ఉంది. ఫోసో ఆగ్రో ఫెర్టిలైజర్ సప్లయర్ వ్యవస్థాపకుడు కూడా అతనే. గురేవ్‌తో పాటు అతని కుమారుడితో వ్యాపారాన్ని అమెరికా నిలిపి వేసింది. బ్యాంక్ లావాదేవీలను ఆపేసింది. ఆస్తుల్ని సీజ్ చేసింది.
రష్యా దాడితో ఉక్రెయిన్‌లో అమాయకులు ఇబ్బందిపడుతున్నారని, కానీ పుతిన్ సన్నిహితులు మాత్రం సంపన్నులయ్యారని, ఖరీదైన జీవితాన్ని గడుపుతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ ఓ ప్రకటనలో తెలిపారు.