H-1B వీసా జారీ ప్రక్రియలో ఆమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న లాటరీ ప్రక్రియకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించింది. ఇకపై వేతనం, నైపుణ్యం ఆధారంగా వీసాల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. అమెరికా ఆర్థిక ప్రయోజానాలను కాపాడటంతో పాటుగా విదేశాలకు చెందిన వారిలో నైపుణ్యం ఉన్న వర్కర్లకే ఈ వీసా ప్రయోజానాలు అందించే ఉద్దేశ్యంతోనే తాజా మార్పులు చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తుది నిబంధనను ఫెడరెల్ రిజిస్టర్‌లో ఇవాళ పబ్లిష్ చేస్తారు. 60 రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి వస్తుంది.
H-1B.. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. యూఎస్ కంపెనీలు విదేశాలకు చెందిన వర్కర్లను ఈ వీసాతో రిక్రూట్ చేసుకుంటాయి. భారత్, చైనాల నుంచే ఎక్కువగా హెచ్-1బీ వీసాలపై అమెరికా వెళ్తుంటారు. తాజా ప్రక్రియతో నైపుణ్యం వారిని ఎంపిక చేసుకోవడమే కాదు.. వారికి వేతనాలు కూడా భారీగా చెల్సించాల్సి ఉంటుంది. లాటరీ ఎంపిక విధానంలో H-1B విసాలు దుర్వినియోగం అవుతున్నాయని… కేవలం ఎంట్రీ లెవల్ వర్కర్లను మాత్రమే కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయని అక్కడి నిపుణులు ఇన్నాళ్లు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే లాటరీ విధానానికి గుడ్‌భై చెప్పినట్టుగా తెలిపింది.
కాగా, H-1B వీసాల జారీపై ఇటీవలే ఆ దేశం పరిమితి విధించింది. ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తుంది.