రెమ్డెస్విర్.. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు వ్యాపించి రోజు రోజుకు వందలాది మందిని బలిగొంటున్న నేపధ్యంలో రెమ్డెస్విర్ యాంటీ వైరల్ డ్రగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలోని గిలీడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన ఈ డ్రగ్ ఇప్పుడు చైనీయులకు వరంగా మారింది. చైనాలోని వ్యాధి బాధితులకు ఇప్పటికే ఈ డ్రగ్ ను ప్రయోగిస్తున్నారు. ఈ విషయాన్ని చైనా దృవీకరించింది. ఈ యాంటీవైరల్ డ్రగ్ సత్ఫలితాల నిస్తుందని తెలిసింది.
అయితే ఫలితాలు అందరి పేషెంట్లలో ఒకే రకంగా కనిపించడం లేదు. వాషింగ్టన్ స్టేట్ లో ఓ కరోనా వైరస్ పేషెంట్ కు రెమ్డెస్విర్ ఇవ్వగా అతని పరిస్థితి విషమించింది. న్యూమోనియా ఎక్కువైంది. వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. చైనాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో పేషెంట్ మీద ఈ డ్రగ్ ఒక్కో రకంగా పనిచేస్తుందని…దీన్ని చైనా ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. అయితే చైనా అధికారికంగా తెలియజేయలేదు.
చైనా అధికార వర్గాల ప్రకారం 500 మంది పేషెంట్లకు 10 రోజుల వరకు ఈ డ్రగ్ ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత 28 రోజులు డ్రగ్ తో చికిత్స చేసి ఇతర పేషెంట్లతో పోల్చి చూస్తారు. రెమ్డెస్విర్ డ్రగ్ పరిమితంగా ఉండడంతో ఉత్పత్తి పెంచే యత్నాల్లో కంపెనీ ఉంది.