అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మూడు అనుమానాస్పద వస్తువులను ఇప్పటికే అమెరికా కూల్చి వేసింది. తాజాగా మిషిగన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సు దగ్గర 20 వేల అడుగుల ఎత్తులో స్థూపాకార వస్తువు ఒకటి ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆ వస్తువును ఫైటర్ జెట్‌తో అధికారులు కూల్చి వేశారు. వారంలో కెనెడాలో ఇది వరుసగా రెండో అనుమానాస్పద వస్తువు కావడం గమనార్హం. అమెరికాలో ఇది నాలుగవ ఘటన కావడంతో అధికారులు ఆందోలన చెందుతున్నారు.
కెనడా గగనతలంలో సుమారు 20వేల అడుగుల ఎత్తులో ఓ స్థూపాకా వస్తువు ఎగురుతూ కనిపించిందని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగ్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు. వెంటనే అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఎఫ్-16 ఫైటర్ జెట్ఏఐఎమ్ 9ఎక్స్ ద్వారా కూల్చేశామని ఆయన పేర్కొన్నారు.
సైనిక స్థావరాలకు సమీపంలో ఆ అనుమానాస్పద వస్తువు ప్రయాణిస్తూ కనిపించిందన్నారు. దాని వల్ల ఎటువంటి సైనిక ముప్పు లేదని చెప్పారు. కానీ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని భావించి దాన్ని కూల్చి వేశామని ఆయన వెల్లడించారు.
దీనిపై తమ బృందం విచారణ జరపుతోందన్నారు. అంతకుముందు, ఆదివారం కెనడా గగనతంలో కారు లాంటి వస్తువును అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని ఫైటర్ జెట్‌లతో కూల్చి వేశారు. కెనడా-అమెరికా సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిందని, అమెరికాకు చెందిన ఎఫ్-22 ఫైటర్ జెట్ ఆ వస్తువును పేల్చేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు.