భార్య తనకు విడాకులు ఇస్తానని పిటిషన్ దాఖలు చేసింది భార్య. ఆ విషయాన్ని సహించలేని భర్త తన కుటుంబాన్ని నిర్దాక్షణ్యంగా కాల్చిచంపాడు. ఈ సంచలన సంఘటన అమెరికాలో జరిగింది. ఈ ఘటనలో అతను సహా ఎనిమిది మంది చనిపోయారు. ఓ ఇంట్లో సాధారణ చెకింగ్ నిమిత్తం వెళ్లగా.. ఈ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని, వారంతా తుపాకీ గాయాలతోనే మరణించాలని అధికారులు తేల్చి చెప్పారు.
ముందుగా ఏడుగురు ఇంటి సభ్యులను చంపి, ఆ తర్వాత మైఖేల్ హైట్ అనే వ్యక్తి కూడా తనను తాను షూట్ చేసుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైఖేల్ భార్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి తన కుటుంబంపై కాల్పులకు పడ్డాడని అధికారులు వెల్లడించారు. మృతుల్లో అతని భార్య, ఆమె తల్లి, దంపతుల ఐదుగురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదురుగు పిల్లల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలున్నట్టు సమాచారం.
వివాహ బంధం విచ్ఛిన్నం నేపథ్యంలోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.