పాక్ పై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి అని ఆయన అన్నారు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
డెమోక్రటిక్ పార్టీ సమావేశాన్ని లాస్ ఏంజెల్స్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన బైడెన్… చైనా, రష్యా దేశాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా అధ్యక్షుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రపంచ మానవాళికి చైనా అనేక సమస్యలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి రష్యా అక్కడ పెద్ద ఎత్తున రక్తపాతాన్ని సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాక్ పై కూడా ఆ మేరకు ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అగ్రరాజ్యంతో సంబంధాలను మరింత మెరుగు పరుచుకోవాలని చూస్తున్న పాక్ కు బైడెన్ వ్యాఖ్యలు శాపంగా మారాయి. మరోవైపు ఆ వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. తమ అణ్వాయుధ కార్యక్రమం ఏ దేశానికి ప్రమాద కరం కాదన్నారు. కేవలం తమ దేశ ప్రయోజనాలను రక్షించడం కోసమేనని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు పాక్ కట్టుబడి వుందని ఆయన పేర్కొన్నారు.