అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న భారతదేశానికి రానున్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా అమెరికా, భారత్ ప్రజల మధ్య బలమైన, విడదీయరాని బంధాలను తెలియజేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. అధ్యక్షుడితో పాటు ఆయన సతీమణి మెలానియా కూడా భారత్ వస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ స్టెఫనీ గ్రిషమ్ తెలిపారు. ఈ విషయమై ట్రంప్, నరేంద్రమోదీల మధ్య ఫోన్ సంభాషణ జరిగిందన్నారు.
రెండు రోజుల భారత పర్యటనలో భారత స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ను సందర్శిస్తారు. 2010-2015 లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇండియాలో పర్యటించారు. ట్రంప్ పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్, పార్ట్ నర్ షిప్ ఫోరమ్ ప్రెసిడెంట్ ముఖేస్ అగి అన్నారు. ట్రంప్ కంటే ముందు పని చేసిన ముగ్గురు అమెరికా అధ్యక్షులు కూడా భారత్ లో పర్యటించినట్టు చెప్పారు. అమెరికాకు ఇండియా ప్రముఖ భాగస్వామ్య దేశమని..అధ్యక్షుడు ట్రంప్ దానికి విలువనిస్తారనే సందేశం ఇతర దేశాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖేష్ అగి.