అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ గుడ్ న్యూస్ చెప్పారు. అక్కడి పౌరసత్వం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రీన్ కార్డ్ లు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి అప్లికేషన్లకు సంబంధించిన ప్రాసెస్ ను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్టు బైడెన్ వెల్లడించారు. ఈ నిర్ణయానికి బైడెన్ యంత్రాంగం ఏకగ్రీవంగా ఓటు వేసింది.
దశాబ్దాల కాలంగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 10 వేల మంది భారతీయులకు ఈ నిర్ణయం ఊరటనిస్తోందని అంటున్నారు. ప్రముఖ భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ సమయంలో దాని 25 మంది కమీషనర్లు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇక నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆరు నెలలలోపే న్యాయనిర్ణేత నిర్ణయాలను జారీ చేయడంపై వివరాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. వలసదారులు దేశంలో ఉంటూ పని చేయడానికి సులభతరం చేసే లక్ష్యంతో.. యూఎస్‌సీఐఎస్ వర్క్ పర్మిట్ లు, ప్రయాణ పత్రాలు, తాత్కాలిక స్థితి పొడిగింపుల కోసం అభ్యర్థనలను మూడు నెలల్లో సమీక్షించాలని.. అందుకు సంబంధించిన నిర్ణయాలను నిర్ధారించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
అందులో భాగంగానే సంవత్సరానికి 2,26,000 గ్రీన్ కార్డులలో 2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 65,452 ఫ్యామిలీ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేశారు. దీంతో వేలల్లో గ్రీన్ కార్డుల దరఖాస్తులు మూలకు వేయపడ్డాయి. దీంతో ఇలాంటి సమస్య మరో సారి రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.