యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంచలన విషయాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 700లకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదైనట్టు సీడీసీ తెలిపింది.
యూఎస్ లోని 21కి పైగా దేశాల్లో కేసులు నమోదవుతున్నట్టు సీడీసీ వెల్లడించింది. మంకీపాక్స్ మొదటి 17 కేసుల్లో 16 కేసులు పురుషుల్లోనే కనిపించాయని సీడీసీ వివరించింది. వీరంతా మరికొంత పురుషులతో సంభోగంలో పాల్గొన్నట్టు గుర్తించామని చెప్పింది.
మరో 14 కేసుల్లో ప్రయాణ సమయంలో మంకీపాక్స్ సోకినట్టు గుర్తించినట్టు వెల్లడించింది. వీరిలో కొంత మంది ఇప్పటికే కోలుకున్నారని, మరికొందరి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని చెప్పింది.
కెనడాలో శుక్రవారం మరో 77 మంకీ పాక్స్ కేసులు నమోదైనట్టు ఆ దేశ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో ఎక్కువ శాతం క్యూబిక్ ప్రావిన్సు ప్రాంతంలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.