రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా పేర్కొంటూ అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రిపబ్లికన్ సెనెటర్ గ్రాహం లిండ్సే ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానానికి ఇరు పార్టీల సెనెటర్లు మద్దతు తెలిపారు. దీనిపై సెనెట్ మెజారిటీ నాయకుడు చార్లెస్ స్కమర్ మాట్లాడుతూ… ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా చేసిన దాడులకు జవాబుదారి తనం నుంచి పుతిన్ తప్పించుకోలేరు అని అన్నారు.
‘ ఈ తీర్మానం ద్వారా ఉక్రెయిన్ కు మద్దతుగా సెనెట్ నిలుస్తుందని స్పష్టమైన సంకేతాలను ఇచ్చాము. దీని ద్వారా ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడులకు పుతిన్ ను జవాబుదారునిగా చేసే ప్రయత్నాలకు మేము అండగా నిలబడుతాము” అని తెలిపారు.
ఇక ఇప్పటి వరకు రష్యా దాడుల్లో ఉక్రెయిన్ లో 90 మంది పిల్లలు చనిపోయినట్టు, వేల మంది గాయపడినట్టు ఆ దేశ జనరల్ ప్రొసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.