పీయం యూఎస్ పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన ‘హౌడీ మోడీ’లో తెలుగు కమ్యూనిటీకి ఒక నిమిషం ప్రోగ్రాం నిర్వహించే అవకాశం వచ్చింది. స్పెషల్‌గా వుంటుందని అనుకున్నారో ఏమో మనోళ్లు ‘పక్కా లోకల్’ అంటూ మాస్ సాంగ్ వేసి రెచ్చిపోయారు. మేము పక్కా లోకల్ ఇండియన్స్ అని చెప్పుకునే భావంతో ఈ డాన్స్ చేసి ఉండవచ్చు. కానీ సాక్షాత్తూ ప్రధాని మోడీ పాల్గొన్న సమావేశం కాబట్టి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రోగ్రాం ఉంటుందని భావించిన వారికి ఇది ఎబ్టెట్టుగా అనిపించింది. ఇలాంటి వ్యాంప్ సాంగ్ వేయటంతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని కామెంట్లు వస్తున్నాయి.
ఇంతకీ హౌడీ మోడీ అంటే ఏంటో తెలుసా..? మోడీ హౌడూయూ డూ అనే పదాన్ని సింపుల్‌గా షార్ట్‌కట్‌లో హౌడీ మోడీ అని పేరు పెట్గేశారు. ఈ భారీ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.