ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఉక్రెయిన్ సరిహద్దుల్లో పర్యటించనున్నారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రొమేనియాల్లో వచ్చే వారం కమలా హరీస్ పర్యటించనున్నట్టు ఆమె డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ వెల్లడించారు.
‘ రష్యా దాడులకు వ్యతిరేకంగా యూరోపియన్ దేశాలను ఆమె ఏకం చేయనున్నట్టు సబ్రీనా తెలిపారు. ఆమె పర్యటనతో నాటో మిత్ర పక్షాల బలం, ఐక్యతను, నాటో తూర్పు దేశాలకు యూఎస్ మద్దతును ప్రదర్శిస్తుంది” అని తెలిపారు.
తాజాగా రష్యాకు చెందిన మరో 50 మంది కుబేరులపై అమెరికా ఆంక్షలను విధించింది. రష్యా అధికార భవనం క్రెమ్లిన్ అధికారి ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ను కూడా ఈ జాబితాలో చేర్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వీరందరినీ దూరం చేయనున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించారు.