అదృష్టం ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరు ఎంత కోరుకున్నా అదృష్టం కలగకపోవచ్చు. మరికొందరికి అసలు ఆ ఆలోచన లేకున్నా.. వారి గుమ్మం తట్టొచ్చు. యూఎస్‌లో ఓ మహిళలకు ఇలాంటి విచిత్ర అనుభవమే ఎదురైంది. మిస్సోరికి చెందిన అత్యవసరంగా మరో ప్రాంతానికి వెళ్లాల్సి రాగా.. తీరా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సరికి.. ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ కాస్త క్యాన్సిల్ అయింది. దీంతో తన దురదృష్టానికి తానే తిట్టుకుంటూ మరో ఫ్లైట్ కోసం అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో అక్కడ కొందరు లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా.. తానూ సరదాగా ఒకటి కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయింది.
కట్ చేస్తే ఆ మహిళ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడే ఏదో జరగబోతోందని అనిపించిందని కానీ.. అది ఇలా ఉంటుందని తాను అనుకోలేదని తెలిపింది. కాగా అన్నీ కటింగ్స్ పోనూ.. ఆ మహిళకు $790,000 వరకు డబ్బు రానుంది. ఇండియా మారకంలో ఇది 75.85 కోట్లకు సమానం.