భారత్ డ్రోన్ మహోత్సవ్ -2022ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. దేశంలో వ్యవసాయం, రక్షణ, క్రీడలు సహా పలు రంగాల్లో డ్రోన్ల వాడకం పెరిగిపోయిందన్నారు.
గ్లోబల్ డ్రోన్ హాబ్ గా మారే సామర్థ్యం భారత్ కు ఉందని ఆయన అన్నారు. డ్రోన్ టెక్నాలజీ విషయంలో భారత్‌లో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమైనదని ఆయన కొనియాడారు.
డ్రోన్ టెక్నాలజీ ఎంత పెద్ద విప్లవానికి ఆధారం అవుతుందో చెప్పడానికి ప్రధాన మంత్రి స్వామిత్వ యోజన ఒక మంచి ఉదాహరణ అని ఆయన వెల్లడించారు.
ఈ పథకం కింద తొలిసారిగా దేశంలోని గ్రామాల్లోని ప్రతి ఆస్తినీ డిజిటల్ మ్యాపింగ్ చేస్తూ డ్రోన్ సాయంతో 65 లక్షల డిజిటల్ ప్రాపర్టీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నట్టు వివరించారు.
కొత్త ఆవిష్కరణలను ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు. తాను వెళ్లిన ప్రతి స్టాల్ లోనూ ఇదే మేక్ ఇన్ ఇండియా గొప్పతనం అంటూ గర్వంగా చెప్పినట్టు మోడీ పేర్కొన్నారు.