సోషల్ మీడియాకు షాకిచ్చింది ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ శాఖ. పోలీసు అధికారులు డ్యూటీ సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది. కీలక సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు బాధ్యతా రహితంగా సోషల్ మీడియాల్లోపడి కాలం వృధాచేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకుంది పోలీస్ శాఖ.
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫాంలో రీల్స్ చేయడం, డ్యూటీ సమయాల్లో చాటింగ్ లు, ఫొటోగ్రాఫ్‌లు పోస్టింగులు చేయడంపై సైతం నిషేధం విధించారు.
అయితే, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు వివిధ సంస్థలతో ఉత్తరప్రదేశ్‌లో అభిప్రాయ సేకరణ చేసింది. అలాగే విదేశాల్లో అమలులో ఉన్న నిబంధనలపై అధ్యయనం నిర్వహించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో సీనియర్‌గా తీసుకొని పాటించాలని ఆదేశించారు.