దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లేటెస్టుగా తెరకెక్కించిన పెళ్లిసందడి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల. ‘ధమాకా’ మూవీ హిట్టుతో వరసు సినిమాలతో దూసుకుపోతోంది ఈ కుర్ర భామ. త్వరలో నితిన్ .. రామ్ .. వైష్ణవ్ తేజ్ లకు జోడీగా అలరించనుంది.
అంతేకాదు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమాలో బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది. ఈ మూవీలో బాలకృష్ణ పాత్ర తర్వాత ఆమె పాత్రకే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.
ఇక ఈ సుందరి పవన్ కల్యాణ్ జోడీగా కూడా ఛాన్స్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా ఆమెను తీసుకున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలు కానుంది. 10వ తేదీ నుంచి శ్రీలీల పాల్గొననున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, సీనియర్ స్టార్ హీరోల జోడీగా కుదిరిపోయింది.
అందుకుతోడు క్రేజ్ కి తగిన సక్సెస్ లు దక్కడం మరో విశేషం. అవే ఆమెను పవన్ సినిమా వరకూ తీసుకుని వెళ్లాయి. ఇక ఈ సినిమాలో మరో నాయికగా మాళవిక మోహనన్ కనిపించనుంది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.