చిన్న చిన్న కేసులలో రేవంత్ కు బెయిల్ ఇవ్వకుండా ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. రేవంత్ రెడ్డికి వెంటనే బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లోకసభ స్పీకర్ దృష్టికి ఇంతకు ముందే తెచ్చాము. మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసి విచారణ జరిపించాలని కోరుతామని తెలిపారు.
రేవంత్ రెడ్డి అరెస్టు, 111 జిఓ అంశాలు, కేటీఆర్ అక్రమాలపై పార్లమెంట్ సమావేశాలు కాగానే సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.