కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాకముందు పనికి రాని విషయాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టాడని, తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్ల సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టేశాడన్నారు.
వలస కార్మికులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుందన్న ఉత్తమ్… కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఉత్తమ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తూ… క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు.