గవర్నర్ ప్రసంగం లేకుండా సెషన్స్ మొదలు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అభిప్రాయపడ్డారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది బీజేపీ, టీఆర్ఎస్ అంశం కాదన్న ఆయన.. రాజ్యాంగ పరిరక్షణ అంశమని తెలిపారు.
సీఎంకు లెజిస్లేటివ్, జ్యూడిషియరీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థల పట్ల చులకన భావం ఉందన్నారు ఉత్తమ్. ఏడున్నరేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను తొక్కేసి కేసీఆర్ మోనార్క్ లా ఫీలవుతున్నారని విమర్శించారు.
గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నేతలకు టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవమానం ఇదివరకు ఎన్నడూ లేదన్నారు.
కేసీఆర్ అనేక సందర్భాల్లో కోర్టును, తీర్పులను చులకన చేసి మాట్లాడారని గుర్తు చేశారు ఉత్తమ్. లేజిస్లేటివ్ సిస్టమ్ ను తమ ప్రాపగాండకు వాడుకుంటున్నారని ఆరోపించారు.