కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారలత్ జోడో పేరుతో పాదయాత్ర చేసేందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకే అంటూ టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెలంగాణలో హత్ సే హత్ జోడో యాత్రను చేపట్టినట్లు ఆయన వివరించారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు నిరుద్యోగ సమస్యను ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాల్లో వివిధ పార్టీలు దేశాన్ని విభజించి పాలించు అనే ధోరణిలో పరిపాలన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.అంతేకాకుండా కాంగ్రెస్ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు కోదాడకు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ థాక్రే, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోస్రాజుతో పాటు జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
రాహుల్ చేపట్టిన భారత్ జూడో యాత్ర 150 రోజుల పాటు దిగ్విజయంగా దేశ చరిత్రలోనే పొలిటికల్ మూమెంట్ గా సాగిందన్నారు.