ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేపు పార్టీ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ హైదరాబాద్ వస్తున్నారు. కొత్త పీసీసీ అధ్యక్ష ఎన్నిక పై అందరి నేతల అభిప్రాయం తీసుకుంటారు. మెజార్టీ అభిప్రాయం ప్రకారం కొత్త పీసీసీ ఎంపిక ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు బంద్ లో పాల్గొని విజయవంతం చేశారు. ఆహార ధాన్యాలు ఇప్పటి వరకు నిల్వచేసుకునే అవకాశం ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కూడా ఆహార ధాన్యాలు నిల్వచేసుకునే కొత్త చట్టం తీసుకొచ్చింది.
కార్పోరేట్ కంపెనీలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నారు.రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తుంది.తెరాస పార్టీ బంద్ లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉంది.ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదు. సన్న రకాలు వడ్లు , పత్తి , జొన్నలకు మద్దతు ధర ఇవ్వలేదు. ఎందుకు రైతు రుణమాఫీ చేయలేదో ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి సమస్యల గురించి మాట్లాడితే బాగుండేది.
రేపు కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా కార్యకర్తలు ఉత్సవాలు చేయవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఉత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాం. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా పేదలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.