తెలంగాణా కంటే చిన్న రాష్ట్రాలు కరోనా టెస్ట్ ల విషయంలో ముందున్నాయన్నారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు కరోనా టెస్ట్ లు తగ్గించారో కెసిఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైఖరి శాస్త్రీయంగా లేదన్నారు ఉత్తమ్. మా పారాసెట్మాల్ తో పోతుందని సెటైర్ వేశారు. రోనా మాస్క్ ల గురించి అడిగితే అవహేళన చేశారు. . మీడియా, ప్రతిపక్షం ను బెదిరిస్తున్నారు. ప్రధాని మోడీ సైతం విపక్షాలతో మాట్లాడుతున్నారు. మన కంటే చిన్న రాష్ట్రాలు అద్భుతంగా చేస్తున్నారు. హైదరాబాద్ లో పని చేసే డాక్టర్స్ కేంద్ర బృందాన్ని కి ఇచ్చిన నివేదిక ఆధారంగా వివరాలు గవర్నర్ కి ఇచ్చామన్నారు.
చనిపోయిన వారి వివరాలు గో ప్యంగా ఉంచుతున్నారు. చనిపోయిన వారికి కరోనా టెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఉత్తమ్. కరోనా తో చనిపోయిన కుటుంబాలకు 10 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియ అందించాలని డిమాండ్ చేశారు. 40 రోజుల లాక్ డౌన్ లో 1500 రూపాయలు ఇంకా అందలేదు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొవాలనికోరాము. నిర్మలా సీతారామన్ ప్రకటించిన సాయం అందలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ను ముఖ్యమంత్రి చేసినట్లు చెప్పుకున్నారు. కేసీఆర్ సాయం కిలో బియ్యం మాత్రమే ఇస్తున్నా… రేషన్ బియ్యం కూడా దారుణంగా ఉన్నాయి. వాటి స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. . 10 లక్షల మంది ఉజ్వల, కోటి మంది దీపం లబ్ధి దారులకు ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి. . వలస కార్మికుల సంఖ్య పై ప్రభుత్వం లో క్లారిటీ లేదు.. మార్చి 15 తారు వాత వచ్చిన వారికే బియ్యం, నగదు ఇస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడం వల్ల వారంతా వెళ్లి పోతున్నారని ఆరోపించారు ఉత్తమ్.