ఉత్తమ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు
బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ వాసులను అవమాన పరిచేలా ఉంది. వరదల్లో వంద మంది చనిపోతే.. హోంమంత్రి గా పరామర్శ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల లో ఓట్ల కోసం వస్తారా.. ప్రధానమంత్రి మోదీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేస్తున్నారు. మోదీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా.. యూపీ సీఎం.. ఆయన రాష్ట్రంలో దళిత మహిళ లపై దాడులు జరుగుతుంటే మిన్నకుండీ పోయారు.
రాష్ట్రం లో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి. కర్ణాటక ఎంపీఅడ్డగోలుగామాట్లాడుతాడు..యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు.. మీరు ఎవరు ఆ మాట అనడానికి. బండి సంజయ్ ..కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి.. ఆయనకు ఏం సంబంధం హైదరాబాద్ గురించి మాట్లాడటానికి. కేంద్రం.. హైదరాబాద్ కు ఏం చేసింది.. గ్రేటర్ అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ హయాంలో నే . వరదలు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు ఎందుకు రాలేదు.. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా.. పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా.. ఇంతకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా…బీజేపీ విషపూరిత ప్రచారం చేస్తుంటేమీడియా చూపడం దురదృష్టకరం. కేసీఆర్ తెలంగాణ ను ఏడేళ్ల పాటు దోచుకున్నారు. నీన్న మీటింగ్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లడలేదు. సభ అట్టర్ ప్లాప్. టీ.ఆర్.ఎస్ పథనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది.హైదరాబాద్ అభివృద్ధి , ఎం.ఐ.ఎమ్ అన్నీ ఒక తాను ముక్కలే.