పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఫలితంపై ఆందోళనతో ఉన్నట్లు కనపడుతోంది. గెలుపుపై నమ్మకం ఉంది అంటూనే… ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన వర్గాన్ని హెచ్చిరిస్తున్నారు.
17సి ఫామ్ తీసుకోవడానికి కౌటింగ్ కేంద్రాల్లో అనుమతించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. 17సి ఫామ్‌లో ఓట్లకు, ఈవీఎంలో పోలైన ఓట్లకు తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించడానికి అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవీఎంలు మొరాయిస్తే… ఆ ఈవీఎంను అక్కడే ఉంచి మిగతావి లెక్కించి, తర్వాత మొరాయించిన వాటిని లెక్కించేలా ప్రయత్నించాలని తన వర్గాన్ని అలర్ట్ చేశారు. ఇక కౌటింగ్ కేంద్రం వద్ద కార్యకర్తలు చివరి రౌండుకు ఉండాలని కోరటంతో పాటు, తన న్యాయవాదులను కౌటింగ్ పూర్తయ్యే వరకు ఉండాలని కోరారు.
దీంతో ఫలితంపై ఉత్తమ్ ఆందోళనతో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఉత్తమ్‌ను ఓటమి కలవరపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.