ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు..సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవానికి బీజేపీ, ఎం ఐ ఎం, టిఆర్ఎస్ లకు ఎలాంటి సంబంధం లేదు.కానీ బీజేపీ, ఎం ఐ ఎం లు మతపరమైన రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత.. ఒక్క కల్వకుంట్ల కుటుంబం దే పెత్తనం అయ్యింది. కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యం తో పని చేయాలి. దుబ్బాకలో గెలిచేలా ప్రణాళిక వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవ్వాలి. 1948కి ముందు మనం భారత దేశంలో విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఉండేవాళ్ళం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి ఇండియా కు స్వతంత్రం వచ్చినంకా తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ను ఇండియాలో విలీనం చేసుకోవాలని కోరడంతో అప్పటి కేంద్ర హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియా లో విలీనం చేసుకొని ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చరూ..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకునే పార్టీ. తెలంగాణ విలీనం అయిన, ఇండియా కు స్వతంత్రం అయిన ప్రత్యేక తెలంగాణ అయిన అన్ని కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అయ్యాయి. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అని మరోసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాక ముందు చెప్పిన ఒక్క మాట కేసీఆర్ నిలబెట్టుకోలేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తా అని దళితులను మోసం చేశారు.. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్ట అన్నారు. గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు..విదార్థులకు కె.జి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణ ను ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగేలా చూడాల్సిన బాధ్యత ఉంది. మన కొత్త ఇంచార్జి ఠాగూర్ మనకు చెప్పినట్టు కాంగ్రెస్ శ్రేణులు ఒక్కటిగా ఉండి క్రమశిక్షణతో పని చేసి రాబోయే ఎన్నికలలో విజయం సాధించాలి..