ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ
రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ప్రభుత్వం గ్రామ ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ఈ ముదానష్టం టిఆర్ఎస్ తీవ్రంగా వేధిస్తోంది.గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను వేధిస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు అండగా ఉంటాము. పాల్వాయి హరీష్ ఈ రాష్ట్ర కన్వీనర్ గా పని చేస్తున్నారు. ఆయన మీకు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆయనకు తెలియజేస్తే వెంటనే స్పందించి పోరాటం చేస్తాం. నా ప్రజా జీవితంలో ఇంత దరిద్రపు పాలనను ఎన్నడూ చూడలేదు. సత్యాగ్రహం, ఒక శాంతి యుతంగా చేస్తుంటే మా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్నారు. టిఆర్ఎస్ కు కాలం దగ్గర పడింది. కల్వకుంట్ల కంపెనీ ఇంకా ఇంటికి పోవాల్సిందే..
గ్రామాల్లో టిఆర్ఎస్ చాలా దుర్మార్గపు పాలన చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయితీలలో ట్రాక్టర్లు కొనమని, ప్రభుత్వం చూపిన ఏజెన్సీ కొనాలని, ఎల్.ఈ.డి లైట్లు కూడా వాళ్ళు చెప్పిన ఏజెన్సీ ల నుంచి కొనుగోలు చేయాలని వెంట పడుతున్నారు. రైతు వేదికలు, వైకుంఠ దామలు కట్టమని ప్రభుత్వం చెప్పింది. ఇంత వరకు బిల్స్ ఇవ్వలేదు. సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోఉంటుంది. ప్రభుత్వం నేరుగా కొంత నిధులు పంచాయతీ లకు ఇవ్వాలి. పంచాయతీ రాజ్ సంఘటన కు మా పూర్తిగా మద్దతు ఉంటుంది.