కాంగ్రెస్ పక్షాన ఎన్నికల సీఈవోను కలిశాం. ఎమ్మెల్సీ ఎన్నికలనిర్వహణలో టీ.ఆర్.ఎస్ అన్ని రకార అక్రమాలకు పాల్పడుతుంది. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతుంది. 43 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ కావాలని ఉద్యోగుల కోరుతుంటే .. మీడియా లో 29 శాతం ఆంటూ లీక్ ఇచ్చారు. టీ.ఆర్.ఎస్ ను ఓడిస్తే.. ఉద్యోగుల కు అనుకూలమైన ఫిట్మెంట్ వస్తుంది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు పంచుతున్నారు. ఓటర్లను తరలించడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారు.. వాటిపై చర్యలు తీసుకోవాలి.
ఫేక్ ఓట్లను.. డిగ్రీ లేని వారిని ఓటింగ్ కు అనుమతి ఇవ్వవద్దు. టిఆర్ఎస్ దొంగ ఓట్లను ఏపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి. పోస్టల్ ఓట్లను పోలీసులు సేకరించి టిఆర్ఎస్ కు వేసేలా పని చేస్తున్నారు. వాళ్ళను అడ్డుకోవాలి. చర్యలు తీసుకోవాలి. వందల కోట్ల యాడ్స్ పై ఇన్ కమ్ ట్యాక్స్ విచారణ జరపాలి. ఎవరు ఈ డబ్బులు ఇస్తున్నారు. వారిపై చర్యలను తిస్కవాలి. పీవీ నరసింహారావు బతికున్నప్పుడు బూతు మాటలు మాట్లాడి.. ఇప్పుడు ఆయన బొమ్మ వాడకోవడాన్ని ఆక్షేపించాం. మా నాయకుడి ఫోటో పట్ల సీఈవో కు మా అభ్యంతరం తెలిపాం.