ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు
న్యాయవాది దంపతులు, గట్టు వామన్ రావు,గట్టు నాగమణిల హత్యపై సిబిఐ దర్యాప్తును చేయాలి.
టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వనరులను కొల్లగొడుతోంది. ఈ హత్య వెనుక టిఆర్ఎస్ మద్దతుగల మాఫియా ప్రమేయం ఉందని అనుమానంగా కూడా ఉంది. దంపతులను దారుణంగా హత్య చేయడాన్ని ముఖ్యమంత్రి కనీసం ఖండించలేదు. మంథని లో దళితుడు షీలామ్ రంగయ్య లాక్ అప్ మరణాన్ని కప్పిపుచ్చడానికి లాయర్ దంపతులను హత్య చేసినట్లు అనుమానంగా ఉంది. 2020 మే 26 న మంథని పోలీసులు థర్డ్ డిగ్రీ హింస కారణంగా రంగయ్య లాకప్ లో మృతి చెందాడు. ఈ విషయంలో న్యాయవాది గట్టు నాగమణి ప్రధాన న్యాయమూర్తికి ఇమెయిల్ పంపారని, రంగయ్య కస్టడి లో హింస కారణంగా మరణించారని ఆరోపించారు. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద పరిగణించింది. మరియు 2020 మే 27 న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. అంజని కుమార్ ఈ కేసును వ్యక్తిగతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
2020 జూన్ 19 న అంజని కుమార్ ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక గోప్యంగా ఉన్నందున, రిజిస్ట్రార్ జనరల్ వద్ద ఉంచిన రిపోర్ట్ సమాచారం తీసుకోవటానికి హైకోర్టు నాగమణికి అనుమతి ఇచ్చింది. పోలీసు శాఖ తనను ఫోన్ ద్వారా బెదిరిస్తోన్నారని ఆమె కోర్టుకు తెలిపింది. కస్టడీ మరణంపై నివేదికకు కౌంటర్ దాఖలు చేస్తే ఆమెను ఆమె భర్త, పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని కొందరు పోలీసు అధికారులు హెచ్చరించారని ఆమె తెలిపారు. కేసును ఉపసంహరించుకోవాలని ఆమె పోలీసు అధికారులచే బెదిరింపులకు గురి చేసారు. వారి పట్ల కఠినమైన చర్యలను ఆమె కోరింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ కేసులో చివరి విచారణ ఫిబ్రవరి 7 న జరిగింది. తనపై మరియు ఆమె భర్తపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నట్లు నాగమణి పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలపై జరిగిన దారుణాలతో సహా మునుపటి కేసులను నిర్వహించినందుకు తన కుటుంబానికి వస్తున్న బెదిరింపులను కూడా ఆమె ప్రకటించారు. టిఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్‌పై కూడా లాయర్ దంపతులు పలు కేసులు నమోదు చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. నేరస్థులలో చట్టానికి భయం లేదు. పట్టపగలే దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.
హత్యలకు పాల్పడిన వారిని శిక్షించకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభిస్తుంది.