ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో శిక్షణలో ఉన్న పర్వతారోహకులు దాదాపు 29 మంది వాటి కింద చిక్కుకుపోయారు.విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెయినీర్ ఇన్స్టిట్యూట్కు చెందిన 40 మంది ద్రౌపది దండా 2 పర్వతారోహణకు వచ్చారు. వారిలో 33 మంది ట్రైనీలు, ఏడుగురు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. అయితే ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో వారిలో 29మంది దాని కింద చిక్కుకుపోయారు.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ దళాలు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.
ఇప్పటి వరకు 8 మందిని రక్షించగా.. వారిని చికిత్స కోసం డెహ్రాడూన్ కు తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి చెప్పారు.