11వేల అడుగుల ఎత్తు.. కొండకు ఆనుకుని స్కైవే.. దానిపై నడుస్తూ కిందకు చూస్తే కొందరికి కళ్లు తిరగడం ఖాయం. 150 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఆ చెక్క మెట్ల మార్గాన్ని 59 ఏళ్ల తర్వాత తెరిచారు.
ఉత్తరాఖండ్ ఉత్తర కాశీ జిల్లాలోని నీలంగ్ లోయలో ఉంది ఈ గర్తంగ్ గలీ స్కైవే. మొత్తం చెక్కతో ఉండే ఈ మార్గాన్ని 150ఏళ్ల క్రితం నిర్మించారు. స్వాతంత్ర్యానికి పూర్వం టిబెట్ తో వ్యాపార కార్యాకలాపాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. 1962లో భారత్, చైనా యుద్ధం తర్వాత ఈ మార్గాన్ని ప్రభుత్వం క్లోజ్ చేసింది. పర్యాటకులను కూడా నిషేధించింది.
2015లో ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేయాలని భావించింది ప్రభుత్వం. దాదాపు రూ.64లక్షలతో రెడీ చేసి తాజాగా రీఓపెన్ చేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఒకసారి పది మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నారు.