కొన్ని డేంజర్ ప్లేసెస్ ఉంటాయి…అలా అని అక్కడ దెయ్యాలు భూతాలు ఏం ఉండవు. వాహనాలు రాకపోకలు కూడా జరుగుతుంటాయి. అయితే అక్కడెప్పుడూ కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి.
జియోగ్రాఫికల్ గా రోడ్డు వేయడంలో టెక్నికల్ ప్రోబ్లమో మరే కారణమో వెరసి అక్కడ తరచూ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఉత్తరాఖండ్ రూర్కీలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు పక్కనే వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది.
ఆ సమయంలో హరియాణా నుంచి ఓ బస్సు కారు వెనుకే వస్తుంది. అయితే ఆ బస్సు..కారును ఢీకొట్టలేదు. దీంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.క్షతగాత్రులందరూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన వారని తెలుస్తోంది. అంతకుముందు గతేడాది డిసెంబరు 30న టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన చోటే ఈ యాక్సిడెంట్ కూడా జరగడం గమనార్హం.
ఈ రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రిషభ్ పంత్ క్రమంలో కోలుకుంటున్నాడు. ఆయన డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.