ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందంటూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా… మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తామని జగన్ ప్రకటనపై ఉత్తరాంధ్ర లాయర్లు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లాలో లాయర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని చెప్పారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని… లేని పక్షంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.