పూరి జగన్నాథ్ బర్త్‌డే సందర్భంగా ఉత్తేజ్ పూరి జగన్నాథ్‌ను, చార్మిని పొగడ్తలతో ముంచెత్తారు. పూరిజగన్నాథ్ దట్టమైన అడవిలాంటోడు… ఎన్నో కార్చిచ్చులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అడవి మళ్లీ పచ్చగా ఉంటూనే ఉంటుంది. జగన్ కూడా అలాంటి ఒడిదుడుకులను ఎదురుకుంటూ వచ్చారు. తన సంపద పోయిన నాడు, ఉన్న నాడు ఒకేలా ఉన్నారు. మేమిద్దరం కృష్ణానగర్‌లో కలిసి పెరిగాం. ఉన్న నాడు లేని నాడు కష్టసుఖాలు కలిసి పంచుకున్నామన్నారు.
ఇక చార్మి గురించి మాట్లాడుతూ… పూరి దర్శకులకు సాయం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వెనుక చార్మీ ఉంది. దర్శక ఫ్యామిలి నుండి వచ్చింది తను. కాబట్టి వారి బాధలు ఆమెకు తెలుసు… అంటూ చార్మి గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు ఉత్తమ్.
నది తన నీరు తను తాగదు
చెట్టు తన పండు తను తినదు
మేఘం తన నీరు తను తాగక పంటలకు ఇస్తుంది. అలాంటి వారు చార్మి అని తెలిపారు. ఇక ఈరోజు గ్రేట్ భగత్ సింగ్ పుట్టిన రోజు. ఆయన దేశం కోసం బ్రతికాడు, జగన్– సినిమా కోసం బ్రతుకుతున్నారన్నారు ఉత్తమ్.