ఉస్మానియా యూనివర్సిటీ స్థలమంతా కబ్జా అవుతోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. సీఎం కేసీఆర్ ఐదు ప్రైవేట్ యూనివర్సిటీ లకు అనుమతి ఇవ్వడం చూస్తుంటే… రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలే ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు..అదే మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కు మాత్రం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ లలో ధనికులకు మాత్రమే అవకాశం ఉంటుంది.ఒక రిటైర్డ్ జడ్జి కుటుంబం ఓయూ భూములను ఆక్రమిస్తుంటే పోలీస్ లు రక్షణ కల్పిస్తున్నారు. ఓయూ భూములు రక్షించాలని విహెచ్ పిలుపునిచ్చారు.