తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరించిన దినోత్సవ వేడుకలను వేడుకలను గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు.
రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద ఆనందంతో కాంగ్రెస్ నేతలు డ్యాన్సులు చేశారు.
కళాకారులు చేసిన కళానృత్య ప్రదర్శన అందరిని అకట్టుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావులు డ్యాన్సులు చేశారు.
వీహెచ్ డోలు వాయిస్తూ గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చిల్ తాత చిందులు మామూలుగా లేవంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.