హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు
రాజ్యాంగాన్ని మార్చాలనడానికి కేసీఆర్ ఎవరు..? దానిని ఎలా మారుస్తారు..? పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని తొలగించారు. విగ్రహాన్ని తీసుకెళ్లి గోషామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు.
20వ తేదీ నుండి అంబేద్కర్ అంశాన్ని గ్రామ గ్రామన పర్యటించి వివరిస్తా. రేవంత్ రెడ్డి దీని గురించి పట్టించుకోని పోరాటాలు చేయాలి. నేను ఎప్పటి నుండో చెప్తున్నా దీనిపై పోరాటం చేయాలని.
ఓట్లు, సీట్ల కోసం కాదు. అంబేద్కర్ అందరివాడు. ఆయన రాజ్యాంగం రాయకపోతే ఇవన్నీ లేవు.
ఆనాడే అంబేద్కర్ విగ్రహం తొలగించినప్పుడు సరైన పోరాటాలు చేసి ఉంటే ఈరోజు కేసీఆర్ రాజ్యాంగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు.