శ్రీరెడ్డి ఎఫెక్ట్...వాకాడ డిస్మిస్

నటి శ్రీరెడ్డి ఎఫెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుపై తీవ్రంగా పడింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ అనేకమంది యువతులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వాకాడ ‘ నిజ స్వరూపాన్ని ‘ శ్రీరెడ్డి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ‘ చిరంజీవి గారూ ! మీ ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే వాకాడ అప్పారావు గారి విషయం కాస్త పట్టించుకొంటారా ? అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే అతని నిజ స్వరూపం ఇదే ‘ అంటూ శ్రీరెడ్డి తన ట్వీట్స్ లో ‘ బాంబు ‘ పేల్చింది.

పర్యవసానంగా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వాకాడ ఔట్ ! మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ ఖైదీ నెం.150 ‘ చిత్రంలో అవకాశాలు ఇప్పిస్తానని, అయితే ఇందుకు తనతో ‘ సహకరించాలని ‘ పలువురు జూనియర్ ఆర్టిస్టు లను వాకాడ ప్రలోభపెట్టాడని ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించినప్పటికీ.. ఈ ఆరోపణల విషయాన్ని తమ సంస్థ సీరియస్ గా పరిగణించిందని కొణిదెల ప్రొడక్షన్స్ సీఈవో విద్యా కొప్పినీడి తెలిపారు. ఈ అంశాన్ని ‘మా ‘ లోని ‘ క్యాష్ కమిటీ ‘ కి నివేదించామన్నారు. విచారణ తరువాత వాకాడపై చర్య తీసుకుంటామన్నారు. కాగా.. ఇదే విషయాన్ని వాకాడ ధృవీకరిస్తూ.. ఈ కంపెనీ నుంచి తాను వైదొలగినట్టు చెప్పాడు.