మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు టాలెంట్ కంటే కూడా పక్క రాష్ట్రాల టాలెంట్ ను చాలా ఫాస్ట్ గా గుర్తించడం మనం చూస్తూనే ఉంటాం. కొందరు అక్కడి నటులకు ఇక్కడ వేలాది మంది అభిమానులు ఉన్నారు. తెలుగులోకి వచ్చే డబ్బింగ్ సినిమాలను చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. ఇక సూర్య, కార్తి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సూర్యతో పాటుగా అజిత్, కమల్ హాసన్, రజనీ కాంత్ సినిమాలకు సైతం మంచి క్రేజ్ ఉంటుంది.
Read Also :భీమ్లా నాయక్ సినిమా కోసం 8ఏళ్ల బాలుడు ఆత్మహత్య
ఇలా తెలుగులో కాస్త ఫేమస్ అయిన హీరో ఒకరు ఉన్నారు. వాన అనే సినిమా ద్వారా తెలుగులో నటించిన వినయ్ రాయ్ అనే ఒక హీరో… ఇప్పుడు విలన్ గా చేస్తున్నాడు. వాన అనే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు గాని పాటలు మాత్రం చాలా బాగా ఫేమస్ అయ్యాయి. ఇక ఈ సినిమా తమిళంలో కూడా హిట్ అయింది. ఈ సినిమా తర్వాత అతను పెద్దగా సౌత్ సినిమాలో కనపడలేదు.
చాలా ఏళ్ళ తర్వాత వినయ్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాడు. శివ కార్తికేయన్ చేసిన డాక్టర్ సినిమాలో నెగటివ్ రోల్ చేసాడు. విశాల్ హీరోగా చేసిన… డిటెక్టివ్ లో విలన్ గా నటించి అలరించాడు. ఈ రెండు సినిమాల ద్వారా తనలో ఉన్న టాలెంట్ ను స్క్రీన్ కు చూపించాడు. విలన్ గా అతనికి అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయనే టాక్ వినపడుతుంది. మరి ఏం చేస్తాడో చూడాలి.