ఒకప్పుడు విజయ్ సినిమాలకు తెలుగులో కోటి రూపాయలొస్తే ఎక్కువ. ఆ తర్వాత తన వసూళ్లతో 3 కోట్ల రేంజ్ కు చేరాడు. అయితే విజయ్ సినిమాకు తెలుగులో మొదటి రోజే 3 కోట్ల రూపాయల ఓపెనింగ్ వస్తే ఎలా ఉంటుంది? వారసుడు సినిమాతో తన చిరకాల కోరిక తీర్చుకున్నాడు విజయ్. తెలుగులో తొలిసారి భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు.
దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కింది వారసుడు సినిమా. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు సినిమా కావడంతో, ఈ మూవీకి టాలీవుడ్ లో భారీ స్థాయిలో థియేటర్లు దొరికాయి. దీంతో విజయ్ కెరీర్ లోనే తొలిసారి తెలుగులో భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా నైజాంలో కూడా రికార్డ్ సృష్టించాడు విజయ్. వారసుడు సినిమాకు నైజాంలో ఫస్ట్ డే కోటి రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 1.40 కోట్లు
సీడెడ్ – 60 లక్షలు
ఉత్తరాంధ్ర – 42 లక్షలు
ఈస్ట్ – 18 లక్షలు
వెస్ట్ – 18 లక్షలు
గుంటూరు – 18 లక్షలు
కృష్ణా – 19 లక్షలు
నెల్లూరు – 13 లక్షలు