విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మాత. వంశీ పైడిపల్లి దర్శకుడు. లెక్కప్రకారం ఈ సినిమా 12వ తేదీన రిలీజ్ అవ్వాలి. బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి పోటీగా వారసుడు రావడం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు.
సెన్సార్ కూడా పూర్తయిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మార్చేశారు. చెప్పిన తేదీకి ఒక రోజు ముందు, అంటే 11వ తేదీనే విజయ్ వారసుడు సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు ఆఘమేఘాల మీద డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు దిల్ రాజు.
ఇలా ఆఖరి నిమిషంలో డేట్ మార్చడం వెనక చాలా పెద్ద లాబీయింగ్ ఉంది. అజిత్ హీరోగా నటించిన తనివు సినిమా 11వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు తమిళనాట భారీగా స్క్రీన్స్ కేటాయించారు. అది రిలీజ్ అయితే, హయ్యస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయం.
అందుకే దాన్ని అడ్డుకునేందుకు తనివుకు పోటీగా వారిసు సినిమాను తమిళనాట విడుదలకు సిద్ధం చేశారు. దీంతో అదే తేదీకి తెలుగులో కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే తాజా నిర్ణయం వల్ల వారసుడు సినిమాకు తమిళనాట ఓపెనింగ్స్ తగ్గడం ఖాయం. ఎందుకంటే, అజిత్ కూడా కోలీవుడ్ పెద్ద స్టార్. భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఆ ప్రభావం వారసుడిపై పడుతుంది. అయితే ఈ ఓపెనింగ్స్, కలెక్షన్లతో దిల్ రాజుకు సంబంధం లేదు. ఎఁదుకంటే, ఆయన ఆల్రెడీ తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను వేరే వ్యక్తికి అమ్మేశాడు.