కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సజావుగా సాగుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటున్న హెల్త్ వర్కర్స్ అంతా సేఫ్ అని అధికారులు ప్రకటిస్తున్నారు. చాలా మంది తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తుండగా… ఒకటి రెండు చోట్ల కళ్లు తిరగటం వంటి ఘటనలు రిపోర్ట్ అయ్యాయి.
అయితే, యూపీలోని మోరదాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆసుపత్రి వార్డ్ భాయ్ మరుసటి రోజు మృతిచెందాడు. 47ఏళ్ల మనోజ్ కుమార్ కు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం నుండి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి ఉందంటూ మనోజ్ ఇంట్లో వాళ్లకు చెప్పారు. కానీ సమయం గడుస్తున్న కొద్ది తన ఆరోగ్యం విషమించగా… ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలో మనోజ్ మరణించాడు.
తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా… ఇది వ్యాక్సిన్ వల్లే ఇలా జరిగిందని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లంటున్నారు. బాడీని పోస్ట్ మార్టం రిపోర్టుకు పంపామని… త్వరలో మరణానికి కారణం తెలుస్తుందంటున్నారు.