దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 172.29 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటన ప్రకారం..
గడిచిన 24 గంటల్లో 46, 82, 662 డోసులను పంపిణీ చేశారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,72,29,47,688కు చేరింది. వీటిలో 1,03,99,129 మంది హెల్త్ వర్కర్లకు మొదటి డోసులు ఇవ్వగా, 99,25,930 మంది రెండో తీసుకున్నారు. 38,43,355 మందికి ప్రికాషన్ డోసులు అందించారు.
ఇప్పటి వరకు 15 నుంచి18 ఏండ్ల వయస్సు గ్రూపు వారిలో 5,16,76,693 మందికి మొదటి డోసులు, 1,34, 05,389 మందికి రెండో డోసును పంపిణీ చేశాము. ఈ రికార్డును 1,92,76,398 సెషన్లలో చేరుకున్నాము.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 50,407 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.37శాతంగా ఉంది.