ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ వద్ద నానా హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారు. నన్నే టోల్ ఫీజు చెల్లించాలని అడుగుతావా అంటూ వారిపై రెచ్చిపోయారు. పరుషపదజాలాన్ని ఉపయోగించారు. అక్కడితో ఆగకుండా దారకి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసిపారేశారు. సిబ్బంది అడ్డగించబోగా.. వారిపై చేయి చేసుకున్నారు. ఎవరో తెలిసి కూడా ఆపుతావా అంటూ చిందులు తొక్కారు. ఆ తర్వాత బారికేడ్లలను తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు.
రేవతి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నంత మాత్రానా.. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడమేంటని పలువురు మండిపడుతున్నారు.