• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » 111 అడుగుల స్వర్ణమయ శివుడు…!

111 అడుగుల స్వర్ణమయ శివుడు…!

Last Updated: February 17, 2023 at 8:46 pm

శివుడు పరమయోగి. భక్తులకు కొంగుబంగారమేమో గానీ తాను మాత్రం శరీరమంతా భస్మం పూసుకుని స్మశానాల్లో తిరుగుతాడు. ఎంత సంపాదించినా..భవబంధాలు తెంచుకుని బూడిదకావాల్సిందేననే కఠోరసత్యాన్ని బోధిస్తాడు.ఆడంబరాలకు ఆమడ దూరం ఉండే శివుడికి 111 అడుగుల ఎత్తైన బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు భక్తులు. ఏళ్ల నాటి స్వర్ణ సంకల్పాన్ని ఈ శివరాత్రి నాటికి పూర్తి చేశారు. గుజరాత్‌లోని వడోదరలో సుర్‌సాగర్ సరస్సు మధ్యలో కొలువైందీ భారీ శివమూర్తి.

మంజల్‌పూర్‌ ఎమ్మెల్యే యోగేశ్‌పటేల్‌ ఆధ్వర్యంలోని సత్యం శివం సుందరం సమితి ట్రస్ట్‌ తీసుకున్న శివసంకల్పమిది. ఏళ్లనాటి ఆ సంకల్పం సరిగ్గా ఈ శివరాత్రి నాటికి పూర్తయ్యింది. 1996లో మొదలైన ఈ విగ్రహ నిర్మాణం 2002లో పూర్తయ్యింది.

అయితే, అప్పుడు కేవలం రాగితో ఏర్పాటయినా… ఆవిష్కరణ మాత్రం జరగలేదు. 2012లో ఈ మహామూర్తిని జాతికి అంకితం చేసిన ఇన్నేళ్ల తర్వాత ఈ విగ్రహానికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్ సంకల్పించింది. మొదట్లో అది సాధ్యం కాదునుకున్నా భక్తుల సహకారంతో ఇలా కార్యరూపం దాల్చింది.

ఈ భారీ విగ్రహానికి బంగారుపూత అంటే మామూలు విషయం కాదుగా. మొత్తంగా, 17.5 కేజీల బంగారం, దానికోసం 12కోట్ల రూపాయల వ్యయం అవసరమవుతుందని తేల్చారు. అయితే, విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు, ఎన్నారైలు ముందుకు రావడంతో మహత్కార్యం ముందుకు సాగింది. దీంతో అనుకున్న సమయానికి.. స్వర్ణ సంకల్పం నెరవేరింది.

ఈ మహాశివుడి మహా మూర్తిని చూసి భక్తజనులు ఉప్పొంగిపోతున్నారు. సరస్సు నడిమధ్యన వెలిసిన ఈ బంగారు శివస్వరూపం సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతుండటంతో వావ్‌ అంటున్నారు భక్త నెటిజన్లు.

హర్‌ హర్‌ మహాదేవ్‌ శంభోశంకర అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. కొందరైతే శివరాత్రి సందర్భంగా స్వర్ణమూర్తిని దర్శించుకునేందుకు రూట్‌మ్యాప్‌ రెడీ చేసేసుకుంటున్నారు.

Gold plated Shiva Statue at Sursagar lake Vadodara. pic.twitter.com/DYKRRey8UE

— Sunita Rathva (@RathvaS7) February 17, 2023

Primary Sidebar

తాజా వార్తలు

35 కు చేరిన మెట్ల బావి మృతుల సంఖ్య!

లొంగిపోయే ప్రసక్తే లేదు..అమృత్ పాల్ సింగ్

రిటైర్మెంట్‌ తీసుకునే ఉద్దేశం నాకు లేదు: గడ్కరీ!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

భూమి అందాల్ని అద్భుతంగా చిత్రించిన…ఓషన్ శాటిలైట్-3..!

ఆ దొంగలు బంగారం…కాజేసిన బంగారాన్ని రిటర్నిచ్చేసారు…కాకపోతే..!?

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

ఏటీఎంలో కాచుకున్న పాము…ఎంటరైన మహిళకు షాకిచ్చిన స్నేక్…!

మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్

ఫిల్మ్ నగర్

బలగానికి  మరింత  బలమిచ్చిన  బెస్ట్ ఫీచర్  ఫిల్మ్ అవార్డ్...!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని ...యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్...!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’...!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

బోస్ ...ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ....!

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

బాలీవుడ్  ‘ఛత్రపతి’గా  బెల్లంకొండ శ్రీనివాస్...దుమ్ములేపుతున్న టీజర్..!

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ శ్రీనివాస్…దుమ్ములేపుతున్న టీజర్..!

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'బలగం' మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap