బ్రెజిల్ లో జోయ్ గిరిజన తెగకు చెందిన తైవీ అనే వ్యక్తి ఇటీవల మూడో డోస్ వ్యాక్సన్ తీసుకున్నాడు. ఇతని పేరు గత ఏడాది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. దానికి కారణం వృద్దుడు, అందుడు అయిన తన తండ్రి వాహుని తన 24ఏళ్ల కొడుకు తైవీ భుజంపై మోసుకుంటూ తీసుకొని వచ్చి వ్యాక్సిన్ వేయించాడు. భుజంపై మోయడం అంటే.. 5 నిమిషాలో 10 నిమిషాలో కాదు. అడవులు, వాగులు దాటుకుంటూ సుమారు 6 గంటలు భుజంపై మోసుకుంటూ వ్యాక్సిన్ కేంద్రానికి తీసుకొని వచ్చి మళ్లీ 6 గంటల తిరుగు ప్రయాణం చేశారు.
ఈ దృశ్యం చూసిన వారంతా ఈ రోజుల్లో ఇలాంటి కొడుకులు ఉంటారా? అని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడ వ్యాక్సిన్ వేసిన డాక్టర్ ఎరిక్ జెన్నింగ్స్ సిమోయిస్ వారికి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సమయం తండ్రి, కొడుకులకు సాయం చేసేందుకు ప్రయత్నించినా.. వద్దు అని సున్నితంగా కొడుకు తైవీ తిరస్కరించాడని ఎరిక్ జెన్నింగ్స్ అప్పుడు చెప్పారు.
అయితే ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించడానికి ప్రధాని కారణం.. తండ్రిని అంత దూరం మొదటి డోసు వ్యాక్సిన్ కోసం మోసుకొని వచ్చిన కొడుకు ఈ సారి ఒంటరిగా వ్యాక్సినేషన్ కోసం రావడమే. వాహూ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో చనిపోయాడు. దీంతో ఆయన వ్యాక్సినేషన్ కోసం ఒంటరిగా వచ్చాడు. వీరిద్దరి పేర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. వాహు మరణానికి కారణాలు తెలియవు.
బ్రెజిల్ పారా స్టేట్‌లో ఈ కమ్యూనిటీ పలు ప్రాంతాల్లో స్థిరపడింది. వాళ్లంతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుండగా.. కరోనా మాత్రం వెంటాడుతోంది. అందుకే వ్యాక్సిన్ కోసం ఇలా సాహసోపేతంగా ప్రయాణిస్తున్నారు. బ్రెజిల్ వ్యాప్తంగా 853 మంది గిరిజనులు చనిపోయారు. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు.