భద్రాద్రి రామయ్య గురువారం నిజరూప అవతారంలో శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిజరూపంలో ఉన్న స్వామివారిని బేడా మండపంలో తీసుకువచ్చి ఆలయ అర్చకులు, వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు.
మహా నివేదన అనంతరం స్వామి వారు సకల రాజ లాంఛనాల నడుమ ఆలయం నుంచి బయలు దేరి మిథిలాల్ స్టేడియంకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాతకుడి సెంటర్ వరకు వెళ్లి భక్తులకు దర్మనం ఇచ్చారు. లోక కంఠకులైన రావణుడు కుంభకర్ణుడు వంటి రాక్షసులకు సంహరించడానికి దశరథుని కుమారునిగా మహా విష్ణువు రాముడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు.
ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల సూర్య గ్రహ బాధలు తొలగిపోతాయని వారు పేర్కొన్నారు. ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు జనవరి 1 నుంచి మొదలు కానున్నాయి.
జనవరి 1వ తేదీన సీతారాములకు తెప్పోత్సవం, 2న ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారాములు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు.