ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ తెచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ మూవీతోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. హిట్ హ్యాంగోవర్ నుంచి తేరుకోకముందే వరుసపెట్టి మూవీలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో వైష్ణవ్ తేజ్ గురించి అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్, అలాగే నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ఆన్‌లైన్ కన్నింగ్ గాళ్లు.. రంగలోకి దిగారు. వైష్ణవ్ తేజ్ పేరుతో ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయం స్వయగా తన దృష్టికి రావడంతో వైష్ణవ్ తేజ్.. స్వయంగా ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు.ట్విట్టర్‌లో నాకు అకౌంట్ లేదు. దయచేసి ఫేక్ అకౌంట్స్ అనుసరించవద్దు. ఆయా అకౌంట్లలో ఉన్న వివరాలను కూడా నమ్మవద్దు. అలాంటి అకౌంట్లు ఎవైనా మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. దయచేసి ఇటువంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ప్రెస్ నోట్‌లో విజ్ఞప్తి చేశారు.
వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కినేని కాంపౌండ్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతోనూ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు.