మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో వైష్ణవ్ తేజ్. తను నటించిన ఉప్పెన మూవీ 100కోట్ల మార్క్ దాటినట్లు ప్రచారం సాగుతుంది. తన ఫస్ట్ సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే డైరెక్టర్ క్రిష్ తో వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఫినిష్ చేశాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ జోష్ లో మరో రెండు సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుండి వస్తున్న ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు అంగీకరించాడని, మనం ఎంటర్ ప్రైజెస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. పైగా ఈ రెండు సినిమాలను ఒకేసారి చేయబోతున్నాడు.
వైష్ణవ్ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు… సరేకానీ ఈ స్పీడులో బొల్తా కొడితేం మాత్రం మళ్లీ కోలుకోవటం అంత హిజీ కాదంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్.